User Avatar Sports

మేడే బహిరంగ సభను విజయవంతం చేయండి..

రాజానగరం..వచ్చే నెల ఒకిటో తేదీన కార్మికుల దినోత్సవం మేడే అఖిల భారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో భారత కార్మిక సంఘాల సమైక్య(ఇష్యూ) నిర్వహించడం జరుగుతుంది అని రైతు కూలీ సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు జె. సత్తిబాబు తెలిపారు. రాజానగరం సమీపంలో సూర్యారావుపేటలో మేడే గోడ పత్రికను ఆవిష్కరించారు. మేడే రోజు కార్మికులతో ర్యాలీ భారీ బహిరంగసభ ఉంటుందన్నారు. దీనిలో కార్మికులకు చట్టాలపై అవగాహన ప్రభుత్వం అమలు చేస్తుంది తదితర అంశాలు వివరించడం జరుగుతుందని చెప్పారు. రాజ్యాంగ పరిరక్షణ సమితి జిల్లా కన్వీనర్ మేకల లక్ష్మీపతిరావు, మరుకుర్తి వీరలక్ష్మి, బొలిశెట్టి సత్యవతి, దొమ్మ సీత, గోర్చ దుర్గా, తుమ్మల కళావతి, నక్కా లక్ష్మీ పాల్గొన్నారు.