User Avatar Crime

ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రిలో ఉద్యోగాలకు దరఖాస్తులు

జిల్లాలో ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రి పరిధి రాజమహేంద్రవరం ఉద్యోగాలకు దరఖాస్తులు చేసుకోవచ్చు అని ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బి. సౌభాగ్య లక్ష్మి అన్నారు. ఉద్యోగాల ఖాళీల వివరాలను బుధవారం విడుదల చేశారు. సుమారు 19 విభాగాలకు సంబంధించిన ఖాళీలు ఉన్నాయి. మే ఒకటో తేదీ నుండి 12వ తేదీ సాయంత్రం  ఐదు గంటల వరకు ప్రభుత్వ వైద్య కళాశాలలో దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుంది. పూర్తి వివరాలు వైబ్ సైట్ లో ఉన్నాయి.