User Avatar Sports

నిరుద్యోగ యువతకు గ్రీస్ దేశంలో ఉపాధి అవకాశాలు….జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి మురళి .

రాజమహేంద్రవరం..నిరుద్యోగ యువతకు గ్రీస్ దేశంలో ఉద్యోగా అవకాశాలు కల్పించుటకు ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్ధ ద్వారా ఇన్స్టలేషన్ టెక్నీషియన్స్, ప్లంబింగ్, నిర్మాణ రంగంలో ఉద్యోగ అవకాశాలు నియామకం ప్రక్రియ చేపట్టడం జరుగుతుందని జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి వి.డి.జి. మురళి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులైన వారు మే 10 లోగా దరఖాస్తు చేసుకోవాలని కోరారు.

ఖాళీగా ఉన్న ఉద్యోగాలు (పనిచేసే నగరం) కోసం వాటికి సంబంధించి పేర్కొన్న అర్హత కలిగిన అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని కోరారు.

1. ఇన్స్టలేషన్ టెక్నీషియన్ (లారిసా ) కోసం అర్హత ఐ టి ఐ ఎలక్ట్రీషియన్ లేదా ప్లంబర్ , అనుభవం: కనీసం 2 సంవత్సరాలు వేతనం 830 యూరోలు ( రూ.180,000/-) పని గంటలు: సోమవారం నుంచి శుక్రవారం, రోజుకు 8 గంటలు.                                                                     2. ప్లంబింగ్, సీవేజ్, ఫైర్ ఫైటింగ్ (గ్రీస్): ఐ టి ఐ ప్లంబర్ అనుభవం: కనీసం 10 సంవత్సరాలు, వేతనం 900 యూరోలు (రూ.187,000/-) పని రోజులు: వారం 6 రోజులు, (రోజుకు 1 గంట ఓవర్ టైమ్ తో)

3. కన్స్ట్రక్షన్ హెల్పేర్స్ – నిర్మాణ రంగం కార్మికులు (ఏథెన్స్ గ్రీస్): అర్హత: ప్రత్యేక విద్యార్హత అవసరం లేదు, అనుభవం: కనీసం 5 సంవత్సరాలు , వేతనం 850 యూరోస్ ( రూ.182,000/-) పని రోజులు: వారం 5 రోజులు, 40 గంటలు

పేరు నమోదు కోసం మే 10 లోగా https://naipunyam.ap.gov.in/program-registration లేదా skillinternational@apssdc.in email కు వివరాలు తెలియ చెయ్యాల్సి ఉంటుందన్నారు.

ఉద్యోగ అవకాశాలు పొందిన వారికి కలుగ చేసే ప్రయోజనాలు ఉచిత నివాసం మరియు రవాణా: హెల్త్ ఇన్సూరెన్స్ సోషియల్ సెక్యూరిటీ అందుబాటులో , గ్రీక్ చట్టం ప్రకారం సెలవులు (Plumbing post కి మాత్రమే)

మరిన్ని వివరాలు తెలుసుకోవడం కోసం 9988853335, 8712655686, 8790118349, 8790117279 లను కార్యాలయ పని సమయంలో సంప్రదించాలన్నారు .