User Avatar others

భారతీయుల కంపెనీ మహీంద్రా & మహీంద్రా కార్ల కంపెనీ

రాజమహేంద్రవరం..భారతీయుడు కంపెనీ భారతీయులు పని చేస్తున్న కంపెనీ మహీంద్రా కార్ల కంపెనీ అని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు, రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల జయ చౌదరి అన్నారు. రాజమహేంద్రవరం కోరుకొండ రోడ్ లోని మహేంద్ర కార్ల షోరూం సోమవారం ప్రారంభించారు. దీనికి ముఖ్య అతిథిలుగా ఎమ్మెల్యే వాసు వచ్చేసి మాట్లాడుతూ పయనీర్ సంస్థ ఆటో మొబైల్ లో మంచి గుర్తింపు ఉందన్నారు. ప్రజల ఇష్టమైన ఆకర్షణీయమైన కార్ల రంగంలో విజయం సాధించాలన్నారు. ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చి చౌదరి మాట్లాడుతూ ఈ కంపెనీలో వేలాదిమంది భారతీయుల పని చేయడం శుభ పరిణామన్నారు. ఆధునిక టెక్నాలజీతో, వివిధ రకాల మోడల్స్ తో మహేంద్ర కంపెనీ కార్లు తయారు చేస్తుందని తెలిపారు. భవిష్యత్తులో హైడ్రోజన్ తో నడిచే కార్లు వస్తాయని అన్నారు. చుక్కపల్లి వారు ఇలాంటి షోరూములు అనేకం ప్రారంభించాలన్నారు. పయనీర్ ఆటో వరల్డ్ చైర్మన్ చుక్కపల్లి రమేష్ , డైరెక్టర్ చుక్కపల్లి రాకేష్ మాట్లాడుతూ ఆధునిక 3ఎస్ (సేల్స్, సర్వీస్, స్పేర్స్ ) సౌకర్యం వినియోగదారులకు ఉపయోగకరంగా ఉంటుందన్నారు.