User Avatar others

కోరుకొండ లో అల్లూరి సీతారామరాజు 101వ వర్ధంతి 

కోరుకొండ…మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 101వ వర్ధంతి  కోరుకొండలో సిపిఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించారు‌. స్ధానిక బస్టాండ్ లో అల్లూరి విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పార్టీ డివిజన్ కార్యదర్శి పల్లా వెంకట నాయుడు మాట్లాడుతూ అటవీ సంపదను కార్పొరేట్ కంపెనీలకు ఇచ్చేందుకు కగార్ ఆపరేషన్ పేరుతో సుమారు 500 మంది వరకు కాల్చి చంపితే దానిలో సుమారు 350 మంది గిరిజనలు ఉన్నారన్నారు. ఆపరేషన్ కగార్ ను ప్రజలు అందరూ వ్యతిరేకించి శాంతి చర్చలు ద్వారా సమస్యలు పరిష్కారం చేసుకోవాలి కోరారు.  దీనిలో జగన్నాథం, నాగన్న, తూరపాటి వెంకన్న,దాసరి వెంకన్న,శ్రీను వెంకన్న,వీరబాబు, రమేష్ తదితరులు పాల్గొన్నారు.