User Avatar Sports

యస్.యస్.సి పబ్లిక్ పరీక్షలకు రీ-కౌంటింగ్, రీ-వెరిఫికేషన్

జిల్లాలో యస్.యస్.సి పబ్లిక్ పరీక్షలకు రీ-కౌంటింగ్, రీ-వెరిఫికేషన్ కు ఈ నెల 24వ తేదీ ఉదయం 10.00 నుండి వచ్చేనెల ఒకటో తేదీ రాత్రి 11.00 వరకు ప్రధానోపాద్యాయు లకు లేదా ఆన్ లైన్ లో ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకొనవచ్చు అని జిల్లా విద్యాశాఖాధికారి కె. వాసుదేవరావు చెప్పారు. రీ-కౌంటింగ్ కు ఒక సబ్జెక్టు రూ.500/-, రీ-వెరిఫికేషన్ కు ఒక సబ్జెక్టు కు రూ.1000/- అయితే పోస్టు, కొరియర్ ద్వారా వచ్చిన దరఖాస్తులు ఎట్టి పరిస్థితులలోను స్వీకరించబడవు అన్నారు. CFMS సిటిజన్ చలాన్ ద్వారా చేసిన చెల్లింపులు ఆమోదించబడవు మరియు తిరిగి చెల్లించబడవు, డి.డి.లు/ బ్యాంకు చెక్కులు ఎట్టి పరిస్థితులలోను స్వీకరించబడదని చెప్పారు.