User Avatar Sports

అన్నదాన సత్రం వేలం పాట రద్దు చేయాలి.

రాజానగరం..రాజా కాండ్రేగుల జోగి జగన్నాధ బహుదూర్ అన్నదాన సత్రం భూములు సత్రం వేలం పాటలో అక్రమాలు జరిగాయని వెంటనే రద్దు చేయాలని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముప్పిడి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. దీనిపై మెయిన్ రోడ్ సత్రం ప్రధాన రహదారిపై పార్టీ అధ్యక్షుడు ముప్పిడి శ్రీను గురువారం రిలే నిరాహారదీక్ష ప్రారంభించారు. ఈ సందర్భంగా ముప్పిడి శ్రీను మాట్లాడుతూ దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు సత్రం భూములు ఏడాదికి 25 ఎకరాల15 సెంట్లు నిర్వహించిన వేలం పాటలో కేవలం సుమారు ఐదు లక్షల రూపాయలకు అధికారులు నిర్ణయించారన్నారు. అయితే ఈ వేలం పాట నిర్వహించిన తర్వాత జనసేన, టిడిపి, బిజెపి నాయకులు అనాధికారంగా మళ్ళీ వేలం పాట ఏర్పాటు చేసి రూ.11 లక్షలు జరిగింది అని తెలిపారు. కూటమి నాయకులు ముందుగా ఒక ప్రణాళిక ప్రకారం రింగ్ గా ఏర్పడి తక్కువకు వేలం పాట దక్కించుకుని తర్వాత అనాధికారికంగా హెచ్చు వేలం పాట నిర్వహించారని ఆరోపించారు.‌ దీనివలన సుమారు ప్రభుత్వానికి రూ.5 లక్షలు పైగా ఆదాయానికి గండిపడిందన్నారు. వెంటనే అధికారులు నిర్వహించిన వేలం పాట రద్దు చేసి సీల్ టెండర్లు లేదా మళ్ళీ బహిరంగ వేలం ద్వారా చేపట్టాలని కోరారు. దీనిపై దేవాదాయ ధర్మాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్ లకు వినతిపత్రాలు అందజేశామని చెప్పారు.